విడుదల తేదీ : 14 జూన్ 2013 TeluguWorld.wap.sh : 3.0/5 దర్శకుడు : సుందర్ సి నిర్మాత : బీ సుబ్రహ్మణ్యం, సురేష్ సంగీతం : సత్య నటీనటులు : సిద్దార్థ్, హన్సిక మోత్వాని , బ్రహ్మానందం…
హీరో సిద్దార్థ్, హన్సిక హీరో హీరోయిన్ లుగా నటించిన సినిమా ‘సమ్ థింగ్ సమ్ థింగ్’. ఈ రొమాంటిక్ కామెడీ సినిమాకి సుందర్ సి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాని తమిళంలో ఖుష్బూ సిద్దార్థ్ రాయ్ కపూర్, రోన్నీ స్క్రూవ్లలు జంటగా తమిళంలో నిర్మించారు. తెలుగులో లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ వారు నిర్మించారు. ఈ సినిమా ఈ రోజు ఆంద్ర ప్రదేశ్ అంతటా విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ :
కుమార్(సిద్దార్థ్) పద్దతి గల వాడు అలాగే హార్డ్ వర్కింగ్ మనిషి. ఒక సంప్రదాయమైన కుటుంబంలో జన్మించిన తనకి ప్రేమ, కొన్ని రిలేషన్స్ అంటే అయిష్టం కానే ఇతన ఫ్యామిలీ మాత్రం లవ్ మ్యారేజ్ ట్రెడిషన్ ని బాగా నమ్ముతారు. కుమార్ చాలా సింపుల్ గా, లైఫ్ లో ఏదో మిస్ అయినట్టుగా జీవితాన్ని గడుపుతుంటాడు. సంజన (హన్సిక మోత్వాని) తన జీవితంలోకి రాగానే మొత్తం మారిపోతుంది. ఆమె కుమార్ ఆఫీసులో కొత్తగా ఉద్యోగిగా చేరుతుంది. కుమార్ ఆమె ప్రేమలో పడతాడు. అప్పటి నుండి తనని ప్రేమలోకి దింపడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ అదే ఆఫీసులో పని చేస్తున్న జార్జ్(గణేష్ వెంకటరమణ) కుమార్ కు పోటిగా వస్తువుంటాడు. నిరాశ చెందిన కుమార్ లవ్ గురు ప్రేమ్ జీ (బ్రహ్మానందం) సహాయం అడుగుతాడు. . ప్రేమ్ జీ ప్రేమికులను కలపడంలో సిద్దహస్తుడు. ప్రేమ్ జీ ఇచ్చే సలహాలను కుమార్ సంజనపై ప్రయోగిస్తూ ఉంటాడు. ఇంతలో స్టోరీలో ఒక ట్విస్ట్. ఇంతలో ప్రేమ్ జీ గతం తెలియడంతో ఒక్కసారిగా అన్నీ మారిపోతాయి. అసలు ఆ ట్విస్ట్ ఏమిటి? అసలు ప్రేమ్ జీ ఎవరు? కుమార్ సంజన వివాహం చేసుకున్నారా? లేదా? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
సిద్దార్థ్ చాలా నీట్ గా ఉన్నాడు, అలాగే చక్కని నటనని ప్రదర్శించాడు. తను నటించిన కుమార్ పాత్రకి పర్ఫెక్ట్ గా సరిపోయాడు. కమర్షియల్ పరంగా చూసుకుంటే ఇటీవల వచ్చిన సినిమాల్లో ఈ సినిమాలో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఈ సినిమాలో బ్రహ్మానందం చాలా ముఖ్యమైన పాత్రలో నటించాడు. ప్రేమ్ జీ పాత్రలో అందరిని చక్కగా నవ్వించాడు. బ్రహ్మానందం, సిద్దార్థ్ ల మద్య జరిగే కామెడీ సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి.
సంజన పాత్రలో హన్సిక చూడటానికి అందంగా వుంది. ఈ సినిమాలో తన నటన బాగుంది. గణేష్ వెంకట్రామన్ కూడా ఆఫీసు సహోద్యోగి పాత్రలో చక్కని నటనను ప్రదర్శించాడు.
సినిమా మొదటి బాగం బాగుంది. అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా ఎక్కువగా ఉంది. బ్రహ్మానందం చమత్కారంగా మాట్లాడే మాటలు ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. బ్రాడ్ పిట్ సతీష్ సన్నివేశాలు చాలా కామెడీగా ఉన్నాయి. వేణు మాధవ్ నటన బాగుంది. సిద్దార్థ్, హన్సిక ల మద్య జరిగే రొమాంటిక్ సీన్స్ బాగున్నాయి.
అతిధి పాత్రలో సమంత నటించడం వల్ల ప్రేక్షకులు చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యారు. సమంత చూడటానికి చాలా అందంగా ఉంది. రానా దగ్గుపాటి బ్రహ్మానందం అభిమానిగా చక్కగా చేశాడు.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాలో సెకండాఫ్ చాలా నెమ్మదిగా సాగింది. ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ ప్లే చాలా బాగుంది, కానీ సెకండాఫ్ లో అంత ఎఫెక్టివ్ గా లేదు. తమిళ నేటివిటి ఎక్కువగా కనిపించింది. నలినీ పాత్ర చాలా చిరాకు తెప్పిస్తుంది.
సినిమాలో జరగబోయేది ముందే ఊహించే విదంగా వుంది. ఈ సినిమా కథ చాలా పాతది. ఈ కాన్సెప్ట్ ని రజినీకాంత్ నుండి సల్మాన్ ఖాన్ వరకు అందరు వుపయోగించారు. అప్పటి వరకూ మంచి ఇంట్రస్టింగ్ గా వున్న సినిమా బ్రహ్మానందం గతం తెలియగానే కథపై ఇంట్రస్ట్ పోతుంది. పాటలు అంత బాగా లేవు. సెకండాఫ్ లో సందర్భానుసారంగా కాకుండా ఎలా పడితే అలా వచ్చి ఇబ్బంది పెడతాయి. ఈ సినిమాకి మంచి పాటలు తోడై ఉంటే సినిమాకి హెల్ప్ అయ్యేది. డబ్బింగ్ కూడా అంత బాగా లేదు. లిప్ మోమెంట్ లో కాస్త జాగ్రత్తలు తీసుకోని ఉంటే బాగుండేది.
సాంకేతిక విభాగం :
గోపి చంద్ సినిమాటోగ్రఫీ ఒకే. ఎడిటింగ్ కూడా బాగుంది. సత్య సి అందించిన సంగీతం ఈ సినిమాకి పెద్ద మైనస్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంత ఎఫెక్టివ్ గా లేదు. వెలిగొండ శ్రీనివాస్ డైలాగ్స్ చాలా చమత్కారంగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కి మంచి దర్శకత్వం వహించిన సుందర్ సి సెకండాఫ్ ని సరిగా తీయలేకపోయారు.
తీర్పు :
‘సమ్ థింగ్ సమ్ థింగ్’ సినిమాలో సెకండాఫ్ కన్నా ఫస్ట్ హాఫ్ బాగుంది. సిద్దార్థ్, బ్రహ్మానందం కలిసి బా గా ఎంటర్టైన్ సినిమాకి ప్రాణం పోశారు. ఆకట్టుకోని సంగీతం, పాత స్టొరీ లైన్ మైనస్ పాయింట్స్. కొన్ని డిసెంట్ రొమాంటిక్ కామెడీ సన్నివేశాలతో ఈ సినిమా ముగుస్తుంది.